ఎర్ర బెండకాయలు.. పండిస్తే లాభం.. తింటే ఆరోగ్యం..

ఎర్ర బెండకాయలు.. పండిస్తే లాభం.. తింటే ఆరోగ్యం..

బెండకాయలు సహజంగా గ్రీన్ కలర్లో ఉంటాయి.. ఇది మనకు తెలిసింది.. ఇవే బెండకాయలు గ్రీన్ కలర్లో కాకుండా మరో రంగులో ఉంటే.. విచిత్రమే కదా.. మన కు విచిత్రంగా అనిపించొచ్చు కానీ.. ఇప్పుడు ఈ ఎర్ర బెండకాయలు పండిస్తున్న రైతులకు సిరులు కురిపిస్తుంది.. తిన్నోళ్లకు ఆరోగ్యం ఇస్తుంది.. కూరగాయల్లో లేడీ ఫింగర్గా.. బెండకాయలకు ప్రత్యేక స్థానం ఉంది. జిగటగా ఉంటాయనే కానీ.. పుష్కలమైన ఆరోగ్యం ఇస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎర్ర బెండకాయల సాగుతోపాటు వాటిని తినటం వల్లే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చర్చ జరుగుతుంది. అదేంటో చూద్దాం...

Also Read : కన్నీళ్లు పెట్టిన ప్రేమ పెళ్లి విషాదం : ఎదిరించి ఒక్కటయ్యారు.. విధి కూడా ఒక్కటిగా తీసుకెళ్లింది

దేశం మొత్తం ఇప్పుడు ఆరోగ్య ఆధారిత వ్యవసాయంవైపు చూస్తోంది. అంటే ఆరోగ్యకరమైన పంటలపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో అధిక యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ కంటెంట్ ఉన్న ఎర్ర బెండకాయ (రెడ్ లేడీస్ ఫింగర్) సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. 

రెడ్ లేడీస్ ఫింగర్లో 94 శాతం బహుళఅసంతృప్త కొవ్వు ఉంటుంది.  ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడే 66 శాతం సోడియం కంటెంట్‌తో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఐరన్ లోపం, రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. అనేక ఆరోగ్య-ప్రయోజనకరమైన లక్షణాలుండటంతో మార్కెట్లో ఆకుపచ్చ బెండకాయ కంటే(గ్రీన్ లేడస్ ఫింగర్) కంటే  ఎర్ర బెండయాలు చాలా ఎక్కువ డిమాండ్ ను కలిగి ఉన్నాయి. 

డార్జిలింగ్కు చెందిన అరుణ్ సింగ్ రైతు.. సిలిగురి సమీపంలో నాలుగు ఎకరాల్లో ఎర్రటి బెండ కాయ సాగు ప్రారంభించాడు. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేంద్రం సేంద్రీయ ఎరువులు వాడుతూ తొలిసారి రెడ్ కలర్ లేడీస్ ఫింగర్ సేద్యం చేశాడు.. ఆకుపచ్చ కూరగాయలతో పోలిస్తే ఎర్రటి బెండకాయలు సాగు తక్కువ ఖర్చు, సమయంతో కూడుకున్నది. దీంతోపాటు మార్కెట్ లో మంచి గిరాకీ, ధర ఉండటంతో సింగ్ మంచి లాభాలు సాధించాడు.  ఆ ప్రాంతంలో రైతులు కూడా ఎర్రటి బెండకాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. 

రెడ్ లేడీస్ ఫింగర్ లో 94 శాతం ఆరోగ్యాన్ని మెరుగు పర్చే కొవ్వు ఉంటుంది. ఇది హైబీపీని నియంత్రించడంలో సాయపడే సోడియం కంటెంట్ 66 శాతం ఉంటుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో సాయ పడుతుంది. ఐరన్ పుష్కలంగా ఉండటంతో రక్తహీనత తొలగిస్తుంది. ఇన్ని లాభాలుండటం వల్ల మార్కెట్ లో లేడీస్ ఫింర్ ధర గ్రీన్ లేడీస్ ఫింగర్ కంటే ఎక్కువ పలుకుతోంది. ఇప్పుడు పచ్చ బెండకాయ ధర రూ. 20 ఉండగా.. ఎర్రటి బెండకాయ ధర రూ. 40 పలుకుతోంది. అయితే కొన్ని చోట్ల ఈ రెడ్ లేడీస్ ఫింగర్ ధర రూ. 700 నుంచి 800 వరకు పలుకుతోంది. 

తక్కువ సేద్యం ఖర్చు, సేంద్రీయ ఎరువులు, అధిక దిగుబడి, ఎక్కువ ధర పలుకుతుండటంతో ఎర్ర బెండకాయ సాగులో రైతు లాభాల బాట పడుతున్నాడని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.