నెల కింద ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు

నెల కింద ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భార్యభర్తలు మృతి చెందిన ఘటన నకిరేకల్ మండలం తాటికల్లు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..   చిత్తలూరి మహేష్(23), రిషిత(19) గత నెల ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే రిషిత తల్లి నల్లగొండలో నివాసం ఉంటుండగా ఆమెను చూసి గుడివాడకు తిరిగి వస్తున్న క్రమంలో తాటికల్లు వద్ద వారి బైక్  ను ట్రాక్టర్ ఢీ కొట్టింది. 

ఈ ఘటనలో మహేష్ అక్కడిక్కడే మృతి చెందగా,  రిషితకు(19) తీవ్ర గాయాలు కావడంతో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.