నోకియా 105, 106 తో యూపీఐ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నోకియా 105, 106 తో యూపీఐ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నోకియా తన లేటెస్ట్ ఫీచర్ ఫోన్లు నోకియా 105, 106 4జీ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్లతో యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుపుకోవచ్చు. వీటిలో 1.8 ఇంచుల క్యూక్యూవీజీఏ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, ఐపీ52 వాటర్ రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. నోకియా 105 ధర రూ.1,299 కాగా,  నోకియా 106 ధర రూ.2,199. ఈ కొత్త కీప్యాడ్ ఫోన్లు యూపీఐ 123పే అనే ఫీచర్ తో వచ్చాయి. ఈ ఫీచర్ వల్లన ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.

UPI 123PAY అనేది ఒక ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్. దీన్ని ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎంతో సురక్షితమైన, భద్రతతో కూడిన విధానం. UPI 123PAY నాలుగు ఆప్షన్స్ ని ఆఫర్ చేస్తుంది. అవి.. ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్, ఫీచర్ ఫోన్ యాప్, మిస్డ్–కాల్ బేస్డ్ ఇంటర్‌ఫేస్ మరియు ప్రాక్సిమిటీ సౌండ్–బేస్డ్ పేమెంట్.