ఆర్బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ ట్యాక్స్ పేమెంట్ లిమిట్ రూ.5 లక్షలకు పెంపు

ఆర్బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ ట్యాక్స్ పేమెంట్ లిమిట్ రూ.5 లక్షలకు పెంపు

రేపో రేటును యధాతధంగా ఉంచుతూ కీలక నిర్ణయం ప్రకటించిన ఆర్బీఐ, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ట్యాక్స్ లిమిట్ ను 5లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంకు. ఇప్పటిదాకా యూపీఐ ట్యాక్స్ పేమెంట్స్ లిమిట్ రూ. 1లక్షగానే ఉంది. ఇప్పుడు దీనిని ఒకేసారి ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించింది ఆర్బీఐ. ఆర్బీఐ తాజా నిర్ణయంతో పెద్ద మొత్తంలో  టాక్స్ చెల్లించేవారు ఏ ఇబ్బందులు లేకుండా రూ. 5 లక్షల వరకు యూపీఐతోనే టాక్స్ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది.

యూపీఐతో చేసే చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. కానీ, డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో చేసినప్పుడు మారుతుంది. కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ ఈ పరిమితి పెంచడం ఇదేం తొలిసారి కాదు. గతంలో 2023 డిసెంబర్‌లో హాస్పిటల్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వంటి వాటికి చేసే యూపీఐ పేమెంట్ లిమిట్‌ను రూ. 5 లక్షలకు పెంచింది. ఇప్పుడు ట్యాక్స్ పేమెంట్స్ లిమిట్ కూడా పెంచేసింది. అయితే, సాధారణ యూపీఐ పేమెంట్స్ లిమిట్ మాత్రం రూ.1 లక్షగానే ఉంది.