హెచ్ఎండీఏకు పైసలే.. పైసల్

హెచ్ఎండీఏకు పైసలే.. పైసల్

హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏకు నిధులవరద మొదలైంది. ఇటీవల నిర్వహించిన ఉప్పల్ భాగాయత్ ప్లాట్ల ఈ–వేలంతో రూ.677 కోట్లతో కాసుల పంట పండితే.. తాజాగా డీపీఎంఎస్ విధానంతో మరో రూ.170 కోట్లకు పైగా హెచ్ఎండీఏ ఖాతాలోకి వచ్చి చేరాయి. నిర్మాణ,లేఅవుట్ అనుమతుల్లో అక్రమాలు చోటు చేసుకోకుం డా మూడేళ్ల కిందట డీపీఎంఎస్(డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్ మెంట్ సిస్టమ్) విధానాన్ని హెచ్ ఎండీఏ అందుబాటులోకి తెచ్చింది.టౌన్ ప్లానింగ్ విభాగంలో అమలవుతున్న ఈ విధానం అతి తక్కువ సమయంలోనే హెచ్ఎండీఏ ఖజానాకు ఆదాయ వనరుగా మారింది. వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలోని టౌన్ ప్లానింగ్ విభాగాలను పరిశీలిస్తే హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ తోనే ఆదాయం పెరుగుతోంది. ప్రస్తుతానికి గ్రేటర్ లో స్థలాలు దొరక్కపోవడంతో డెవలప్పర్లు , బిల్డర్లు , రియల్టర్లు శివారులోని భూముల కొనుగోలుపై దృష్టి సారించారు. దీనికి తోడు శివారు ప్రాంతాలలో భారీగా ప్రాజెక్టులు వస్తుండటంతో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా లే అవుట్ కోసం అనుమతులు పెరుగుతున్నాయి.

మార్పులకు శ్రీకారం

బిల్డింగ్ పర్మిషన్స్, లే అవుట్ గేటెడ్ కమ్యూనిటీ,లే అవుట్ విత్ హౌసింగ్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎ-న్ఓసీ ), పెట్రోల్ పంప్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఫైనల్ లేఅవుట్ ఓపెన్ ప్లాట్ అనుమతులను ఆన్ లైన్ లోనే జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి హెచ్ఎండీఏ యంత్రాంగం ఆన్ లై న్ సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో అనుమతుల్లో వేగం పుంజుకుంది. మరో వైపు లే అవుట్ అనుమతులు తీసుకున్న బిల్డర్లు సరైన మౌలిక వసతులు కల్పించడం లేదని ప్లాట్ల కొనుగోలుదారుల నుం చి ఫిర్యాదులు అందుతుండడంపై స్పందించిన హెచ్ఎండీఏ కమిషనర్ డీపీఎంఎస్ విధానంలోమరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ప్లాట్ల కొనుగోలుదారులకు మరిన్ని వసతులు కల్పించేందుకు ఫైనల్ లేఅవుట్ మంజూరుకు ముందు అన్నీ పూర్తి చేయాలన్నరూల్స్ తీసుకొచ్చారు. మురుగునీటి పారుదల వ్యవస్థ, మిషన్ భగరీథ, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ తో పాటు మరికొన్ని నిబంధనలను వర్తింప జేసి డెవలప్ చేయాలని బి ల్డర్లు , రియల్టర్లను ఆదేశించారు. ఇలా డీపీఎంఎస్ విధానం పారదర్శకంగా అమలు చేస్తుం డటంతో జనవరిలో అత్యధికంగా రూ.64కోట్ల రాగా, ఫిబ్రవరిలో రూ.34 కోట్లు,మార్చిలో రూ.20 కోట్లు, ఏప్రిల్ నెలలో 29వతేదీ నాటికి రూ.49 కోట్ల ఆదాయం వచ్చిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తంగా నాలుగు నెలల్లోనే రూ.170 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. మరోవైపు అక్రమ వెంచర్లపై యంత్రాంగం దృష్టి సారిస్తే మరింతగా ఆదాయం పెరిగే అవకాశముందని హెచ్ఎండీఏ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.