
హైదరాబాద్: ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ ను చంపుతామని బెదిరించాడు ఉప్పల్ కార్పొరేటర్ భర్త. ఉప్పల్ విజయపురి కాలనీలో జహంగీర్ అనే అతను సాయి వికాస్ ప్రైవేట్ స్కూల్ ను నడుపుతున్నాడు. అయితే అతని స్కూల్ కు ఎటువంటి పర్మిషన్ లు లేవని, స్కూల్ లో పిల్లలకు ఉండాల్సిన సదుపాయాలు కూడా లేవని ఆరోపించాడు ఉప్పల్ కార్పొరేటర్ మేకల అనల రెడ్డి (టీఆర్ఎస్) భర్త మేకల హన్మంత్ రెడ్డి. స్కూల్ నడవాలంటే తమకు 5లక్షల రూపాయలను లంచంగా ఇవ్వాలని కోరారు. డిమాండ్ చేసిన నగదును ఇవ్వకపోతే చంపేస్తానని జహంగీర్ ను హన్మంత్ రెడ్డి, అతని కారు డ్రైవర్ శ్రీనివాస్ బెధిరించారు.
జహంగీర్ నగదు ఇవ్వకపోవడంతో అతన్ని చంపడానికి స్కూల్ దగ్గర రెక్కీ నిర్వహించాడు శ్రీనివాస్. పరిస్థితిని గమనించిన జహంగీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీటీవీలను గమనించిన పోలీసులు శ్రీనివాస్ స్కూల్ దగ్గర రెక్కీనిర్వహించినట్లు తెలుసుకున్నారు. కంప్లేంట్ తీసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.