ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్ క్లియర్
రూ.1.48 కోట్ల బకాయి చెల్లింపు
హైదరాబాద్, వెలుగు : ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ బకాయిల వివాదం ముగిసింది. టీఎస్ఎస్‌పీడీసీఎల్‌కు బకాయి ఉన్న మొత్తాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యవర్గం చెల్లించింది. రూ. 1.48 కోట్ల మొత్తాన్ని చెక్ రూపంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు మంగళవారం టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీకి అందజేశారు. దాంతోపదేండ్లుగా నడుస్తున్న వివాదానికి తెరపడింది. 2015 నుంచి టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు రూ.1.64 కోట్ల బిల్లు బకాయిగా ఉండగా, ఐపీఎల్ సమయంలో ఆ శాఖ అధికారులు స్టేడియానికి కరెంట్ కట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
దాంతో ఈ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తామన్న హెచ్‌సీఏ తొలి విడతా రూ. 15 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు మిగిలిన మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేసినట్టు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ తెలిపారు. ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ కట్ చేసి, హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎండీ ఫరూఖీని జగన్ కోరారు.
