సరికొత్తగా ఉప్పల్ స్టేడియం..వరల్డ్ కప్ కోసం అధునాతన సౌకర్యాలు

సరికొత్తగా ఉప్పల్ స్టేడియం..వరల్డ్ కప్ కోసం అధునాతన సౌకర్యాలు

వన్డే వరల్డ్ కప్ 2023 కు ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ఆధునీకరించారు.  సీట్ల సామర్థ్యంతో పాటు...అభిమానుల కోసం ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం సామర్థ్యం 39 వేలు. అయితే గతంలో  11 వేలు పాత సీట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేశారు. స్టేడియంలో ఇప్పటికే కొత్త LED ఫ్లడ్లైట్లు, కొత్త కుర్చీలు ఏర్పాటు చేయడంతో నూతన కళ సంతరించుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో అక్టోబర్‌ 6, 9, 10 తేదీల్లో వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. 

వన్డే ప్రపంచ కప్ 2023 కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అదిరిపోతుందని పర్యవేక్షకుడు ఐపీఎస్ దుర్గ ప్రసాద్ తెలిపారు. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే అన్ని  మ్యాచుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 11  వేల నూతన చైర్లు, నూతన రూప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మ్యాచు ప్రత్యక్షంగా వీక్షించే  అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామన్నారు. వాటర్ సదుపాయాలు గతం తరహాలో ఇప్పుడు ప్రపంచ కప్ కు కూడా అందిస్తామన్నారు.

  • స్టేడియంలో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా చక్కటి అవుట్‌ ఫీల్డ్‌ సిద్ధం
  • స్టేడియంలో మూడు వైపులా నార్త్, సౌత్, ఈస్ట్‌లలో పైకప్పు ఏర్పాటు
  • సౌత్‌లో పాడైపోయిన పైకప్పు పునరుద్ధరణ
  • పాతవాటి స్థానంలో కొత్తగా ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు