Viral Video: రూ.500 నోట్లపై పడుకొని ఫొటో దిగాడు..ఇరకాటంలో పడ్డాడు

Viral Video: రూ.500 నోట్లపై పడుకొని ఫొటో దిగాడు..ఇరకాటంలో పడ్డాడు

ఓ పక్క  దర్యాప్తు సంస్థలు సోదాలు, అరెస్ట్లు, నోటీసులతో రాజకీయ నేతలను హడలెత్తిస్తుంటే..మరో పక్క  అసోంకు చెందిన ఓ రాజకీయ నాయకుడు విచిత్ర చర్యలతో నెట్టింట హల్ చల్ సృష్టిం చాడు. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధిలోని వైరాగురి VCDC చైర్మన్  బెంజిమన్ బసుమతరీ ఫొటో ఒకటి ఇంటర్నెట్ లో  ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఫొటోలో బసుమతరీ 500 రూపాయల నోట్లపై పడుకుని, వాటితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటో వైరల్ కావడంతో  బసుమతరీకి ఇంత డబ్బు ఎక్కడిది.. అక్రమసంపాదన ఏమైనా ఉందా.. అని డౌట్లమీద డౌట్లతో అనేక విచారణలకు దారితీసింది. UPPL పార్టీకి చెందిన ఈ నేతకు చెందిన విచిత్ర కథ వివరాలేంటో తెలుసుకుందాం..

బెంజిమన్ బాసుమతరి.. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్  పరిధిలోని యూనైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL) నాయకుడు. ఇతడు 500 రూపాయల నోట్లపై పడుకుని ఉన్న ఫొటో వైరల్ కావడంతో UPPL పార్టీ అధ్యక్షుడు.. బాసుమతరిపై కోపంతో చిందులేశారు.. పార్టీ ప్రతిష్టను గంగలో కలిపేలా బాసుమతరి వ్యవహరించాడని..అతనిపై విచారణకు ఆదేశించాడు. బాసుమతరి చర్యల వల్ల్ ఆ పార్టీలో గందరగోళం నెలకొంది.   

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా బెంజిమన్ బాసుమతరి తీరుపై భగ్గున మండిపడుతున్నారు. దేశంలో అవినీతి ఎప్పుడు అంతం అవుతుందో అని తిట్టుకుంటూ కామెంట్లు పెట్టారు.