యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి

యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి

యూపీఎస్సీ సివిల్స్ 2023 టాపర్ దోనూరి అనన్య రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.  ఏప్రిల్ 20వ తేదీ శనివారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన కుటంబ సభ్యులతోపాటు వెళ్లి ఆయనను కలిసింది అనన్య. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆమెకు శాలువ కప్పి సన్మానించారు.  ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో పాలమూరుకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. 

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా అడ్డాకల్‌‌‌‌ మండలం, పొన్నకల్‌‌‌‌ గ్రామం. చాలా ఏండ్ల క్రితమే మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ టౌన్ లోని లక్ష్మీనగర్‌‌‌‌ కాలనీలో అనన్య తల్లిదండ్రులు స్థిరపడ్డారు. కాగా, అనన్య రెడ్డి ఫస్ట్ నుంచి టెన్త్ వరకూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదివారు. ఇంటర్‌‌‌‌ ప్రారంభం నుంచే ఐఏఎస్‌‌‌‌ వైపు అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా ఆమె హైదరాబాద్‌‌‌‌లోని నారాయణ ఐఏఎస్‌‌‌‌ అకాడమీలో చేరారు. ఇంటర్‌‌‌‌ పూర్తి అయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్‌‌‌‌ కాలేజీలో బీఏ(బ్యాచిలర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌)లో చేరారు. 2020 నుంచి పూర్తి స్థాయిలో సివిల్స్‌‌‌‌ ప్రిపరేషన్‌‌‌‌ ప్రారంభించారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్‌‌‌‌ పరీక్షలకు సొంతంగానే ప్రిపేర్ అయ్యారు. సివిల్స్‌‌‌‌లో ఆప్షనల్‌‌‌‌ సబ్జెక్టుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఒక్క ఆంత్రపాలజీ కోసం మాత్రమే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కోచింగ్ తీసుకున్నారు.