- ఏమైనా జరగొచ్చు.. పాక్ లోకి అమెరికా నేరుగా వెళ్లి అటాక్ చేసింది
- భారత్ అదే పని ఎందుకు చేయూడదు: జైట్లీ
న్యూఢిలీ: ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఏమైనా జరగొచ్చని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ సమయంలో ఒక వారం అనేది చాలా ఎక్కువ అని, గడిచిన 24 గంటలను గమనిస్తే.. ఒక వారమంతా ఆ రోజులో గడిచిపోయినట్లు అనిపిస్తుందని చెప్పారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అమెరికా నేవీ సీల్స్ నేరుగా పాకిస్థాన్ లోకి వెళ్లి ఒసామా బిన్ లాడెన్ ను చంపారు. మరి అదే పని భారత్ ఎందుకు చేయకూడదు’’ అని జైట్లీ అన్నారు. ఇన్నాళ్లు ఇలా ఎందుకు చేయకూడదని భారతీయుల్లో ఒక ఆశ, ఫ్రస్టేషన్ ఉండేేేేదని, ఈ రోజు అది జరగడం సాధ్యమేనని చెప్పారు.
