drug submarine: డ్రగ్స్ జలాంతర్గామిని పేల్చేశాం..లేకుంటే 25వేల మంది అమెరికన్లను చంపేసేది: ట్రప్

drug submarine: డ్రగ్స్ జలాంతర్గామిని పేల్చేశాం..లేకుంటే 25వేల మంది  అమెరికన్లను చంపేసేది: ట్రప్

వాషింగ్టన్​ : కరేబియన్​ సముద్రంలో డ్రగ్స్​రవాణా చేస్తున్న జలాంతర్గామిని అమెరికా ధ్వంసం చేసింది. ఆ జలాంతర్గామి డ్రగ్స్​ను అక్రమంగా అమెరికాకు రవాణా చేస్తున్నట్లు అందుకే పేల్చేశామని ఆదివారం ( అక్టోబర్19) వైట్ హైస్ ప్రకటించింది. గురువారం జరిగిన ఆపరేషన్ లో జలాంతర్గామిని పేల్చేశామని ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు వెల్లడించింది. 
గడిచిన కొన్ని వారాల్లో ఇది ఆరవ దాడిగా అమెరికా తెలిపింది. మునుపటి దాడుల్లో 27 మంది  మృతిచెందారు. 

25వేల మంది అమెరికన్లు చనిపోయేవారు.. 

డ్రగ్స్​అక్రమ రవాణా చేస్తున్న జలాంతర్గామిని వదిలేస్తే దాదాపు 25 వేల మంది అమెరికన్లు చనిపోయేవారని ట్రంప్​ తన సోషల్​ మీడియా ప్లాట్​ఫాం ట్రూత్​ సోషల్​ లో రాశారు. దాడిలో బయటపడ్డ ఇద్దరు ఈక్వెడార్​, కొలంబియాకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం.. విచారణకోసం వారిని స్వదేశాలకు పంపుతామన్నారు ట్రంప్​. 

డ్రగ్స్​ కు వ్యతిరేకంగా ట్రంప్​ చర్యలు.. 

లాటిన్ అమెరికా నుంచి అమెరికాకు డ్రగ్స్​రవాణా కట్టడి చేయడం ట్రంప్ సీరియస్​ దృష్టి పెట్టారు. ఈ ప్రాంతంలో డ్రగ్స్​ రవాణా చేసే ఓడలు, సబ్​ మెరిన్​ పై అమెరికన్ సెక్యూరిటీ అధికారుల దాడులను కరెక్టేనని సమర్థించారు. అయితే ఐక్యరాజ్యసమితి నియమించిన మానవ హక్కుల నిపుణులు ట్ంప్​ చర్యలను విమర్శించారు.