భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన అమెరికన్ ఎంబసీ

భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన అమెరికన్ ఎంబసీ

భారత విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ శుభవార్త చెప్పింది. కరోనాతో అమెరికాలోకి విద్యార్థులకు చాలాకాలం నుంచి ప్రవేశం లేకుండా పోయింది. కరోనా తగ్గుముఖం పడుతున్న ఈ నేపథ్యంలో.. అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు జూన్ 14 నుంచి వీసాల జారీ ప్రారంభిస్తామని అమెరికన్ ఎంబసీ ప్రకటించింది.

అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఎంబసీ.. జూన్ 14 నుంచి వీసా ప్రాసెసింగ్ మొదలుపెట్టి.. ఆగష్టులో పూర్తి చేస్తామని తెలిపింది. భారతీయ విద్యార్థుల కోసం సోమవారం నుంచి పదివేల వీసా ఇంటర్వ్యూ స్లాట్లను అందుబాటులో ఉంచుతామని.. హాజరుకావలనుకునే వాళ్లు ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్ చేసుకోవాలని తెలిపింది. ఆగష్టు 1, 2021న లేదా ఆ తరువాత మొదలయ్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని రాయభార కార్యాలయం తెలిపింది.