అమెరికా జీడీపీ వృద్ధి 1.6 శాతం

అమెరికా జీడీపీ వృద్ధి 1.6 శాతం

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌లో అమెరికా జీడీపీ వార్షికంగా 1.6 శాతం  మాత్రమే పెరిగింది. యూఎస్ కామర్స్ డిపార్ట్‌‌మెంట్ అంచనా వేసిన రెండు శాతం కంటే తక్కువగా నమోదైంది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌– డిసెంబర్‌‌‌‌లో టారిఫ్‌‌లు, యుద్ధ భయాలతో కేవలం 0.5 శాతం మాత్రమే వృద్ధి చెందింది. 

తాజాగా ఇరాన్‌‌ యుద్ధం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిందని, వినియోగం పడిపోయిందని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. అయితే  ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఖర్చులే ఆర్థిక కార్యకలాపాలను నడిపిస్తున్నాయని పేర్కొంది.