32 సంస్థలపై ట్రంప్ ఆంక్షలు..ఇరాన్‌‌‌‌ క్షిపణి ప్రయోగాలకు మద్దతు ఇస్తుండటంతో చర్యలు

32 సంస్థలపై ట్రంప్ ఆంక్షలు..ఇరాన్‌‌‌‌ క్షిపణి ప్రయోగాలకు మద్దతు ఇస్తుండటంతో చర్యలు

న్యూయార్క్‌‌‌‌: ఇరాన్‌‌‌‌ క్షిపణి ప్రయోగాలకు మద్దతు ఇస్తున్నాయని ఆరోపిస్తూ పలు దేశాలకు చెందిన 32 సంస్థలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇరాన్‌‌‌‌ లో క్షిపణి, డ్రోన్‌‌‌‌ (యూఏవీ) తయారీ కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రంప్​ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

 అణు ఒప్పందానికి అనుగుణంగా ఇరాన్​ వ్యవహరించడం లేదని ఆరోపించింది. ఇరాన్‌‌‌‌ ఆర్థిక వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ తన అణు ఆయుధాల తయారీకి నిధులు సమకూర్చుకుంటున్నదని పేర్కొంది.