కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కథ మళ్లీ మెుదటికి రావటంతో ఇన్వెస్టర్లకు భారీగా నష్టాలు

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కథ మళ్లీ మెుదటికి రావటంతో ఇన్వెస్టర్లకు భారీగా నష్టాలు

కొత్త నెల ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహబించని విధంగా ఒలటాలికీటి గురవుతున్నాయి. నిమిషాల్లో లాభాల నుంచి నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు వెళుతుండటం ఇన్వెస్టర్లను గందరగోళానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలోనే భారీ నష్టాల్లోకి జారుకుని ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ అత్యధికంగా 900 పాయింట్లు కోల్పోయింది. ప్రధానంగా ఐటీ షేర్లలో లాభాల బుక్కింగ్, క్రూడ్ ధరలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇదే క్రమంలో రియల్టీ, బ్యాంకింగ్ స్టాక్స్ కూడా సూచీలను కిందకు లాగుతున్నాయి. 

ఉదయం 10.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 805 పాయింట్లు, నిఫ్టీ సూచీ 222 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 454 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 512 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. అయితే మార్కెట్లను నిన్నటి లాభాల నుంచి నష్టాల దిశగా నడిపిస్తున్న కీలక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. రాజుకున్న యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు..
గల్ఫ్ రీజియన్‌లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోవడం మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. బహ్రెయిన్, కువైట్ సహా ఇతర ప్రాంతీయ లక్ష్యాలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులను తాము అడ్డుకున్నామని లేదా అవి విఫలమయ్యాయని అమెరికా సైన్యం ప్రకటించడంతో గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. వాషింగ్టన్ - టెహ్రాన్ మధ్య దౌత్యపరమైన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో ఆందోళనను మరింత పెంచింది.

2. సెంచరీ దిశగా క్రూడ్ ఆయిల్..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం నేరుగా కమొడిటీ మార్కెట్‌పై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 1 శాతానికి పైగా పెరిగి, బ్యారెల్‌కు 97 డాలర్ల మార్కును దాటింది. భారత్ లాంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ముడిచమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి, కార్పొరేట్ కంపెనీల లాభాలపై ప్రభావం పడుతుందనే భయంతో ఇన్వెస్టర్లు విక్రయాలకు మొగ్గు చూపారు.

3. ఇండియా విక్స్ జంప్..
మార్కెట్లో నెలకొన్న తీవ్ర అనిశ్చితికి అద్దం పడుతూ.. 'ఫియర్ గేజ్' గా పిలిచే ఓలటాలిటీ ఇండెక్స్ దాదాపు 8 శాతం పెరిగి 16.57 స్థాయికి చేరుకుంది. విక్స్ ఇండెక్స్ ఈ స్థాయిలో పెరగడం అనేది మార్కెట్లో రాబోయే రోజుల్లో మరిన్ని ఒడుదొడుకులు ఉంటాయనడానికి సంకేతం. దీంతో ట్రేడర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక సేఫ్ జోన్‌కు వెళ్లిపోయారు.