జపాన్ సముద్రంలో కూలిన అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్

జపాన్ సముద్రంలో కూలిన అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్

టోక్యో :  అమెరికాకు చెందిన ఓస్ప్రే ఎయిర్ క్రాఫ్ట్ జపాన్ సుముద్ర తీరంలో కుప్పకూలింది. బుధవారం యకుషిమా ద్వీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన జరిగినప్పుడు అందులో 8 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఇంజన్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని ముందుగా కొంత మంది యకుషిమా మత్స్యకారులు గుర్తించి కోస్ట్ గార్డ్ కు సమాచారమిచ్చారు. దీంతో కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్, పెట్రోలింగ్ బోట్స్ సహాయక చర్యలు చేపట్టి ఓ వ్యక్తిని గుర్తించాయి. మిగిలిన వారిని గుర్తించేందుకు, వారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.  ఓస్ప్రే అనేది అమెరికా సైనిక విభాగానికి చెందిన ప్రత్యేకమైన వాహనం. ఇది హెలికాప్టర్, విమానంగాను రెండు రకాలుగా పనిచేస్తుంది. ఓస్ప్రే ఎయిర్ క్రాఫ్ట్​లు 2012 నుంచి ఐదు సార్లు ప్రమాదానికి గురి కాగా 19 మంది మరణించారు.