అమెరికాలో విమాన ప్రమాదం.. భారత సంతతి మహిళ మృతి

అమెరికాలో విమాన ప్రమాదం.. భారత సంతతి మహిళ మృతి

అమెరికాలోని న్యూయార్క్ వద్ద విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన రోమా గుప్తా అనే 63 ఏళ్ల మహిళ మృతి చెందారు. రోమా గుప్తా, ఆమె కూతురు రేవా గుప్తా, వారి వైమానిక శిక్షకుడు కలిసి పైపర్ చెరోకీ విమానంలో లాంగ్ ఐలాండ్ నుంచి బయల్దేరారు. ఈ క్రమంలో విమానంలోని కాక్ పిట్ లో పొగలు వ్యాపించాయి..దీంతో తిరిగి విమానాశ్రయానికి చేరుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రోమా మృతి చెందగా.. రేవా, శిక్షకుడికి తీవ్ర గాయాలయ్యాయి. 

క్షతగాత్రులు ప్రస్తుతం స్టోనీ బ్రూక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. "ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. కూలిపోయిన విమానంలో చిక్కుకుపోయిన వారిని ఒక పౌరుడు బయటకు లాగి కాపాడాడని" నార్త్‌ లిండెన్‌హర్స్ట్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ కెన్నీ స్టాలెన్‌ వెల్లడించారు.