హెచ్, ఎల్ వర్కర్ వీసాలకు లక్ష స్లాట్లు 

హెచ్, ఎల్ వర్కర్ వీసాలకు లక్ష స్లాట్లు 
  • యూఎస్ వీసా అపాయింట్మెంట్లకు వెయిటింగ్​ టైమ్​ ఇది

అమెరికా వీసాలకు అపాయింట్మెంట్ల కోసం ఇండియన్స్​ ఏకంగా రెండేండ్లకు పైనే వెయిట్ చేయాల్సి వస్తోంది. అదే చైనా జనానికి మాత్రం కేవలం రెండు రోజులే చాలు.  ఢిల్లీలో యూస్​ వీసాల అపాయింట్మెంట్ల కోసం ఏకంగా 833 రోజుల వెయిటింగ్​ టైమ్​ ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెబ్ సైట్​లో కన్పిస్తోంది. ముంబైలో 848 రోజులు, హైదరాబాద్ లో 582 రోజుల వరకు చూపిస్తోంది. స్టూడెంట్ వీసాలకు సైతం బీజింగ్​లో 2 రోజులే వెయిటింగ్​ టైమ్​ఉండగా.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్​లో 430 రోజులుగా ఉంది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల విషయంలోనూ ఎదురుచూడాల్సిన టైమ్​ సుదీర్ఘంగానే కన్పిస్తోంది. ఇక పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్​లో విజిటర్ వీసాకు 450 రోజులు ఉండగా, స్టూడెంట్, నాన్ ఇమిగ్రేషన్ వీసాలకు ఒక రోజు మాత్రమే వెయిటింగ్​ టైమ్​ కన్పిస్తోంది.

న్యూఢిల్లీ: అమెరికా వీసాలకు అపాయింట్మెంట్ల కోసం చైనీస్ ప్రజలు రెండ్రోజులు మాత్రమే వెయిట్ చేయాల్సి ఉండగా.. ఇండియన్లు మాత్రం ఏకంగా రెండేండ్లకు పైనే వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇండియన్లకు యూఎస్ వీసా అపాయింట్మెంట్ల కోసం వెయిటింగ్ టైం రోజురోజుకూ పెరుగుతూనే పోతోంది. చైనా రాజధాని బీజింగ్ లో యూఎస్ విజిటర్ వీసా అపాయింట్మెంట్లకు 2 రోజులు మాత్రమే వెయిటింగ్ టైం ఉండగా.. ఢిల్లీలో ఏకంగా 833 రోజులు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెబ్ సైట్ లో కన్పిస్తోంది. అలాగే ముంబైలో 848 రోజులు, హైదరాబాద్ లో 582 రోజుల వరకు వెయిటింగ్ టైం చూపిస్తోంది. స్టూడెంట్ వీసాలకు సైతం బీజింగ్ లో 2 రోజులే వెయిటింగ్ టైం ఉండగా.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లలో 430 రోజులు ఉంది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల విషయంలోనూ వెయిటింగ్ టైం కూడా సుదీర్ఘంగానే కనిపిస్తోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్​లో విజిటర్ వీసాకు 450 రోజులు ఉండగా, స్టూడెంట్, నాన్ ఇమిగ్రేషన్ వీసాలకు ఒక రోజు మాత్రమే వెయిటింగ్ టైం కన్పిస్తోంది. 

బ్లింకెన్ తో ప్రస్తావించిన జైశంకర్ 

ఇండియన్ లకు యూఎస్ వీసా వెయిటింగ్ టైం రెండేండ్లకుపైనే ఉండటంపై మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మంగళవారం యూఎస్ విదేశాంగ మంత్రితో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై బ్లింకెన్ స్పందిస్తూ.. కరోనా టైంలో ఎంబసీల స్టాఫ్ తగ్గడం, కొవిడ్ తగ్గాక వీసాలకు డిమాండ్ పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉందని,  సమస్య పరిష్కరిస్తామని అన్నారు. 

డిమాండ్ పెరగడం.. స్టాఫ్ తగ్గడమే కారణం  

ఇండియాలోని అమెరికన్ కాన్సులేట్ లలో వీసా వెయిట్ టైమ్ భారీగా పెరగడంపై యూఎస్ ఎంబసీ కాన్సులర్ వ్యవహారాల మినిస్టర్ కౌన్సెలర్ డాన్ హెఫ్లిన్ గురువారం మధ్యాహ్నం ఫేస్ బుక్ లైవ్ చాట్ లో వివరణ ఇచ్చారు. ‘‘ఇండియా నుంచి గతంలో ఎన్నడూలేని  స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. కరోనా కారణంగా అన్ని ఎంబసీల్లోనూ స్టాఫ్ కొరత ఉంది. యాక్టివిటీస్ తిరిగి పుంజుకోవడానికి సమయం పడుతోంది. మెక్సికో, కొలంబియా, తదితర ఎంబసీల్లోనూ వెయిట్ టైం ఇలాగే ఉంది. వెయిట్ టైంను తగ్గించేందుకు ఎంబసీల్లో టెంపరరీ కౌన్సెలర్లను, స్టాఫ్​ను నియమించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని చెప్పారు. 

హెచ్, ఎల్ వర్కర్ వీసాలకు లక్ష స్లాట్లు 

వచ్చే కొన్ని వారాల్లో హెచ్, ఎల్ వర్కర్ వీసాల అపాయింట్మెంట్లకు దాదాపు లక్ష స్లాట్లను కేటాయించనున్నట్లు హెఫ్లిన్ వెల్లడించారు. ప్రత్యేకంగా ఫస్ట్ టైం అప్లికెంట్లకు వీటిని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అలాగే టూరిస్టులు, బిజినెస్ మెన్ కు కేటాయించే బీ1/బీ2 వీసాలకు వెయిట్ టైమ్ ప్రస్తుతం 800 రోజుల వరకూ ఉందని, ఈ టైమ్ ను తగ్గించేందుకు కూడా వచ్చే కొన్ని నెలల్లో చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇండియన్ స్టూడెంట్లకే వీసాలు ఎక్కువిచ్చినం

ఈ ఏడాది సెప్టెంబర్ 8 నాటికి ఇతర అన్ని దేశాల కంటే ఇండియన్ స్టూడెంట్లకే ఎక్కువగా 82 వేల వీసాలు జారీ చేసినట్లు యూఎస్ ఎంబసీ అధికారి క్రిస్ ఎల్మ్స్ చెప్పారు. కాగా, అమెరికా స్టూడెంట్ వీసాలకు ఇంటర్వ్యూలను నవంబర్ రెండో వారంలో ప్రారంభిస్తామని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. ఇంటర్వ్యూలు డిసెంబర్ చివరిదాకా  కొనసాగుతాయని తెలిపింది.