క్రెడిట్​కార్డులను ఇలా వాడుకుంటే బెటర్

క్రెడిట్​కార్డులను ఇలా వాడుకుంటే బెటర్

బిజినెస్​ డెస్క్​, వెలుగు: సాధారణంగా అయితే ఇంటి కిరాయి మొత్తాన్ని ప్రతి నెలా ఒక తేదీన యజమాని చేతికి ఇస్తారు లేదా బ్యాంకు ఖాతాకు నెఫ్ట్​/ఐఎంపీఎస్​ వంటి పద్ధతుల ద్వారా డిపాజిట్​ చేస్తారు. అయితే, క్రెడిట్​కార్డు ద్వారా కూడా అద్దె చెల్లించవచ్చు. ఇందుకు కొంత ఛార్జీ పడుతుంది. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్ కోసం లేదా ప్రయాణంలో క్యాష్​లెస్​​ పేమెంట్ల ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చాలా మంది ఉపయోగిస్తున్నారు.  అద్దె సాధారణంగా నెలలో అత్యంత ఖరీదైన ఖర్చుల్లో ఒకటి. ఈ చెల్లింపును వాయిదా వేసే అవకాశం ఉండదు కాబట్టి దీనిని సకాలంలో చెల్లించడం కూడా చాలా ముఖ్యం. మీకు ఆర్థిక సమస్యలు ఉంటే,  ఇతర ప్రధాన ఖర్చుల కోసం డబ్బు ఆదా చేయాలనుకుంటే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె కట్టడం బెటర్​. దీనివల్ల కొంతకాలం నగదును ఆదా చేసుకోవచ్చు. మీకు సాధారణంగా నెలలో 5 లేదా 10వ తేదీన జీతం వస్తుందని అనుకుందాం.  మీ అద్దె నెల ఒకటో తేదీన బకాయి ఉంటే,  క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అద్దె చెల్లించవచ్చు. క్రెడిట్​ బిల్​ అదే నెల 20 న వస్తే.. మీరు 15 రోజుల తరువాతే దాని బిల్​ చెల్లించవచ్చు.  అంతేకాదు స్కూలు ఫీజులు, మెయింటనెన్స్​ ఖర్చులనూ క్రెడిట్​కార్డు ద్వారా చెల్లించవచ్చు.  పేటీఎం, క్రెడ్​, రెడ్​ జిరాఫీ, ఫ్రీచార్జ్​, అమెజాన్ ​వంటి ఎన్నో యాప్స్​ క్రెడిట్​కార్డు ద్వారా అద్దె కట్టడానికి వీలు కల్పిస్తాయి. 

యాప్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి..
క్రెడిట్​కార్డుతో రెంట్ కట్టడానికి అనుమతిచ్చే యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్టర్​ చేసుకోవాలి. యజమాని, కిరాయిదారు చిరునామాలు, బ్యాంకు వివరాలు ఇవ్వాలి. కొన్ని యాప్స్​ రెంటల్ అగ్రిమెంటును కూడా అడుగుతాయి. కిరాయి మొత్తం రూ.50 వేలు దాటితే యజమాని పాన్​ కార్డు వివరాలనూ ఇవ్వాలి. డబ్బు ఏ తేదీన చెల్లించాలి, ఎంత చెల్లించాలి ? వంటి సమాచారాన్ని పేర్కొనాలి. ఇలా ఒక్కసారి వివరాలను ఇస్తే ప్రతి నెలా నిర్దిష్ట తేదీన రెంట్​ కట్టేయొచ్చు.   మనదేశంలో మెజారిటీ యాప్​లు క్రెడిట్​కార్డుతో అద్దె చెల్లింపుకు ఒక శాతం కన్వీయెన్స్​ ఫీజును వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు రూ.10 వేలు కిరాయి కట్టాలంటే రూ.100 కన్వీయెన్స్​ ఫీజుగా చెల్లించాలి. పేజ్​యాప్​ వంటి ప్లాట్​ఫారమ్​ల ద్వారా కిరాయి చెల్లిస్తే రెడ్ జిరాఫీ, నోబ్రోకర్​, హౌజింగ్​డాట్​కామ్​ వంటివి కొంత క్యాష్​బ్యాక్​ ఇస్తున్నాయి. వీటికితోడు రివార్డు పాయింట్లు ఇస్తున్నాయి.  ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్, లాయల్టీ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎయిర్ మైల్స్ వంటి వాటి వల్ల చాలా తక్కువ కన్వీనియెన్స్​ ఫీజుతో కిరాయి చెల్లింపు సాధ్యమవుతుంది.

ముఖ్యమైన యాప్​లు వసూలు చేస్తున్న చార్జీలు
అప్లికేషన్               ఛార్జీలు (%)    డాక్యుమెంట్లు      కార్డురకం
ఫోన్ పే                         2                   అవసరం లేదు    అన్ని క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 
పేటీఎం                       1                   అవసరం లేదు     అన్ని క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
క్రెడ్​  యాప్               1.5– 2               అవసరం లేదు    అన్ని క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  
మ్యాజిక్ బ్రిక్స్            1.18             అప్​లోడ్​ చేయాలి    అన్ని క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 
నోబ్రోకర్ లేదు             1                  అవసరం లేదు     అన్ని క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 
హౌసింగ్​ డాట్​కామ్​     1                   అవసరం లేదు      అమెక్స్,  డైనర్స్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మినహా అన్నీ
రెడ్ జిరాఫీ          0.39 +జీఎస్టీ       అప్​లోడ్​ చేయాలి     అమెక్స్ మినహా అన్ని క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు