సెట్టింగ్స్‌‌తోనే ఫోన్ లో యాడ్స్‌‌ను బ్లాక్‌‌ చేయొచ్చు

సెట్టింగ్స్‌‌తోనే ఫోన్ లో యాడ్స్‌‌ను బ్లాక్‌‌ చేయొచ్చు

ఫోన్‌‌లో ఏదన్నా సెర్చ్‌‌ చేసి చూస్తున్నా, చదువుతున్నా  మధ్యలో యాడ్స్‌‌ వచ్చి డిస్టర్బ్‌‌ చేస్తుంటాయి. వాటిని బ్లాక్ చేయడానికి గూగుల్‌‌ ప్లే స్టోర్‌‌‌‌లో థర్డ్‌‌ పార్టీ యాప్స్‌‌ డౌన్‌‌లోడ్‌‌ చేసుకుంటారు చాలామంది. థర్డ్‌‌ పార్టీ యాప్స్‌‌ వాడటం ఎప్పటికైనా రిస్కే.. కాబట్టి వాటిని వాడకుండా ఫోన్‌‌లో ఉన్న సెట్టింగ్స్‌‌తోనే ఆ యాడ్స్‌‌ను బ్లాక్‌‌ చేయొచ్చు.

మొదట ఫోన్‌‌లో సెట్టింగ్స్ ఓపెన్‌‌ చేయాలి. దాంట్లో ప్రైవేట్‌‌ డిఎన్‌‌ఎస్‌‌ అని టైప్‌‌ చేయాలి. తరువాత ఫోన్‌‌ బాటమ్‌‌లో ‘ఆఫ్‌‌, ఆటోమెటిక్‌‌, ప్రైవేట్‌‌ డిఎన్‌‌ఎస్‌‌ ప్రొవైడర్‌‌‌‌ హోస్ట్‌‌నేమ్‌‌’ అని మూడు ఆప్షన్స్‌‌ వస్తాయి. దాంట్లో ప్రైవేట్‌‌ డిఎన్‌‌ఎస్‌‌ ప్రొవైడర్‌‌‌‌ హోస్ట్‌‌నేమ్‌‌ని క్లిక్‌‌ చేస్తే కింద టైపింగ్ బార్ వస్తుంది. దాంట్లో ‘డిఎన్‌‌ఎస్‌‌.యాడ్‌‌ గార్డ్‌‌.కామ్‌‌’ అని టైప్‌‌ చేసి సేవ్‌‌ చేయాలి. ఇలా చేస్తే ఫోన్‌‌లో యాడ్స్‌‌ బ్లాక్ అవుతాయి.