కేఆర్ఎంబీ బోర్డుకి ప్రాజెక్టులు ఇస్తామని మేమెక్కడా చెప్పలేదు: ఉత్తమ్

కేఆర్ఎంబీ బోర్డుకి ప్రాజెక్టులు ఇస్తామని మేమెక్కడా చెప్పలేదు: ఉత్తమ్

కేఆర్ఎంబీ బోర్డుకి ప్రాజెక్టులు ఇస్తామని తామెక్కడా చెప్పలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  ప్రాజెక్టుల విషయంతో తప్పు చేసినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.  పదేళ్లలో కృష్ణా రివర్ వాటర్ రాష్ట్రానికి ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు.  తెలగాణకు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీటిని బీఆర్ఎస్ డైవర్ట్ చేసిందన్నారు.  కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతే బీఆర్ఎస్ నోరు మెదపలేదన్నారు. 8 నుంచి 10 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతే ఎందుకు స్పందించలేదన్నారు. కేవలం 2 టీఎంసీల నీటి కోసం ప్రభుత్వం ఇబ్బందులు పడిందన్నారు.  

ఫ్రీగా వచ్చే నీటిని గత సర్కార్ వినియోగించుకోలేకపోయిందన్నారు మంత్రి ఉత్తమ్.  బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసి లబ్ధిపొందాలని చూస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాకే సీలేరు ప్రాజెక్టు పోయిందన్నారు. గజ్వేల్ కి ప్రధాని మోదీ వస్తే..కేసీఆర్  ఒక్క మాట మాట్లాడలేదన్నారు.  

సివిల్ సప్లై శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు సివిల్ సప్లై అప్పులు 3 వేల కోట్లు ఉంటే..ఈ పదేళ్లలో  బీఆర్ఎస్  58 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెప్పారు ఉత్తమ్.