
విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన సినీ ప్రముఖులు విగ్రహాల తొలగింపుపై జీ`ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం` నిరసనకు దిగింది. సినీ పరిశ్రమకు విశేషమైన సేవలందించిన వీరి విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సినీ రంగానికి వన్నె తెచ్చిన దర్శకుడు దాసరి గారి విగ్రహం తొలగించడం ద్వారా తెలుగు కళా రంగాన్ని అవమానించడమే అని సంఘ కార్యదర్శి, దర్శకుడు కారెం వినయ్ ప్రకాష్ అన్నారు. ఆయన విగ్రహాన్ని తమ సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పుతామని సంఘం అధ్యక్షుడు `బాదంగీర్ `సాయి అన్నారు. ఈ ధర్నాలో ఉత్తరాంధ్ర దర్శకులు రమేష్, శివశ్రీ, గీతాలయ ప్రసాద్, రాకేష్ రెడ్డి, లోలుగు రాజశేఖర్ లతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన సినీ, టీవీ నటీనటులు, దర్శకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.