బలరాంపూర్ అత్యాచార బాధితురాలు మృతి

బలరాంపూర్ అత్యాచార బాధితురాలు మృతి

బలరాంపూర్(యూపీ): హత్రాస్ దారుణ ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్​లోని బలరాంపూర్ జిల్లాలో మరో గ్యాంగ్ రేప్ బాధితురాలు మరణించింది. ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడిన 22 ఏళ్ల దళిత మహిళ హాస్పిటల్​కు తరలిస్తుండగా చనిపోయింది.  ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ‘నా కూతురు మంగళవారం కాలేజీలో అడ్మిషన్ కోసం వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కిడ్నాప్ చేశారు. రూమ్​కు తీసుకెళ్లి మత్తు సూది ఇచ్చి రేప్  చేశారు. కాళ్లు, నడుం విరగ్గొట్టారు. తర్వాత రిక్షాలో ఇంటి దగ్గర పడేశారు’ అని మృతురాలి తల్లి చెప్పింది. బాధితురాలిని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయిందని తెలిపింది.తల్లిదండ్రుల కంప్లయింట్​తో నిందితులు షాహిద్, సాహిల్​ను అరెస్టు చేశామన్నారు. మృతురాలి తల్లి ఆరోపిస్తున్నట్లు కాళ్లు, నడుము విరిగినట్లు పోస్ట్ మార్టంలో కన్ఫామ్ కాలేదని చెప్పారు. పోస్ట్ మార్టం తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. గురువారం బలరాంపూర్ కలెక్టర్,  ఎస్పీ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. రూ.6.18 లక్ష ఆర్థిక సాయం చేస్తామని లెటర్ అందించారు.

రేప్ బాధితురాలు సూసైడ్ అటెంప్ట్

బాగ్ పత్ (యూపీ): ఉత్తర ప్రదేశ్ లో మరో బాలికపై రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాగ్ పత్ ప్రాంతంలో 17 ఏండ్ల బాలికను ఆమె ఇంటి పక్కన ఉండే నసీం రేప్ చేశాడు. అది తట్టుకోలేక బాలిక సెప్టెంబర్ 27న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చేర్పించగా కోలుకున్న బాధితురాలు తండ్రికి జరిగిందంతా చెప్పింది. ఆయన 29న పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. నిందితుడు తన కూతురిని రేప్ చేయడంతో పాటు వేధింపులకు గురి చేశాడని, బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి ఆరోపించారు. నిందితుణ్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు.

షామ్లీ జిల్లాలో మహిళ డెడ్ బాడీ

షామ్లీ జిల్లాలో ఓ మహిళ డెడ్ బాడీ దొరికింది. కంద్లా టౌన్​లోని రైల్వే ట్రాక్ సమీపంలో సగం కాలిపోయిన మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ‘‘డెడ్ బాడీ బుధవారం సాయంత్రం కనిపించింది. పోస్టుమార్టం కోసం పంపించాం. చనిపోయిన మహిళను గుర్తించకుండా ఉండేందుకు నిందితులు డెడ్ బాడీని కాల్చేందుకు ప్రయత్నించారు” అని ఎస్​హెచ్​ఓ చెప్పారు.

For More News..

హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు చేసిన్రు

ఇప్పటిదాకా సీఆర్పీఎఫ్‌లో 10 వేల మందికి కరోనా