బీసీల జనగణన కోరుతూ..వీహెచ్ నిరవధిక నిరాహార దీక్ష

బీసీల జనగణన కోరుతూ..వీహెచ్ నిరవధిక నిరాహార దీక్ష
  •     మద్దతు ప్రకటించిన నేతలు

అంబర్​పేట్, వెలుగు: దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో ఓబీసీలను కూడా లెక్కించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (వీహెచ్) శనివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అంబర్​పేటలోని తన నివాసంలో ప్రారంభించిన ఈ దీక్షకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు భారీగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే జనగణనలో వారిని కూడా లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. 

దీనిపై ప్రధాని మోదీకి పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. బీసీల పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈ దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న మద్దతు పలికారు. అలాగే ఓబీసీ కమిటీ చైర్మన్ శంకరయ్య, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్ సంఘీభావం ప్రకటించారు.