V6 News

సినిమాకి సరిహద్దులు ఉండవని వాలా 2 ప్రూవ్ చేసింది: హీరో సాయి దుర్గ తేజ్ 

సినిమాకి సరిహద్దులు ఉండవని వాలా 2 ప్రూవ్ చేసింది: హీరో సాయి దుర్గ తేజ్ 

ఇటీవల  కేరళ బాక్సాఫీస్  దగ్గర  రెండు వందల  కోట్లకుపైగా కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌తో  సంచలనం సృష్టించిన చిత్రం ‘వాలా 2’.  శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి  టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లోనూ సక్సెస్ టాక్ తెచ్చుకుంది.  సావిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వంటి యువ నటీనటులు నటించారు. షైన్ స్ర్కీన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సాహు గారపాటి,  విపిన్ దాస్, హారిస్ దేశం, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్ కలిసి నిర్మించారు. 

తెలుగులో యూనానిమస్‌‌‌‌‌‌‌‌ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో శనివారం టీమ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించింది. అతిథిగా హాజరైన హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్‌‌‌‌‌‌‌‌తో పికప్ అయింది. షోలు హౌస్‌‌‌‌‌‌‌‌ఫుల్ అవుతున్నాయి.  సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవని తెలుగు ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. మరో గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరైన హీరో నిఖిల్ మాట్లాడుతూ ‘నేను సినిమా చూస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంజాయ్ చేశా. 

మలయాళంలో  అయినట్టే  తెలుగులో కూడా అదే స్థాయిలో విజయం దక్కాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.  మలయాళంలో గొప్ప విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా ప్రతి షోకు ఆదరణ పెరుగుతోందని, ఈ విజయాన్ని అందించిన అందరికీ మరోసారి ధన్యవాదాలు అని నిర్మాత సాహు గారపాటి అన్నారు. తెలుగులోనూ తమ సినిమాకు మంచి ఆదరణ దక్కడం ఆనందంగా ఉందని డైరెక్టర్ సావిన్, నటీనటులు అన్నారు.