తెలంగాణలో ఆదివారం వ్యాక్సినేషన్ యధాతథం

V6 Velugu Posted on Jun 19, 2021

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆదివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం యధాతథంగా కొనసాగుతుందని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. సోషల్ మీడియాలో కొంత మంది రేపు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు.. సోమవారం నుండి కొనసాగుతున్నట్లు ఉన్న మెసేజ్ ను షేర్ చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పటిదో పాత వార్తను తీసుకుని ఇప్పుడు తాజాగా షేర్ చేస్తున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వైర్ అవుతున్న ఈ వార్తను నమ్మొద్దని, రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆదివారం వ్యాక్సినేషన్ యధాతథంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ కింద ఫోటోలో ఉన్నది పాత వార్త అని హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలందరూ ఆదివారం తమకు సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు.  

Tagged Covid Treatment, corona treatment, , corona updates, covid updates, telangana Vaccination latest updates, health department updates, vaccination updates

Latest Videos

Subscribe Now

More News