సర్కారు టార్గెట్​ : 50 లక్షల మందికి వ్యాక్సిన్

సర్కారు టార్గెట్​ : 50 లక్షల మందికి వ్యాక్సిన్

నాలుగు నెలల్లో ఇవ్వాలని సర్కారు టార్గెట్​
నేటి నుంచి ప్రైవేటు హాస్పిటళ్లలో టీకా పంపిణీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అరకోటి మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ టార్గెట్‌‌ పెట్టుకుంది.  51,48,184 మందికి 4 నెలల్లో రెండు డోసులివ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు డోసులను కూడా పంపిణీ చేసింది. ఈ మేరకు హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ రిపోర్టు రూపొందించి ప్రభుత్వానికి మంగళవారం అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి 215 ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లో టీకా పంపిణీ జరగనుంది. దీంతోపాటు 17 సీజీహెచ్‌‌ఎస్, 12 ఆయూష్మాన్ హాస్పిటల్స్‌‌లోనూ వ్యాక్సిన్‌‌ వేస్తారు. ప్రభుత్వాసుపత్రుల్లోనూ సెంటర్లను క్రమంగా పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ఈ హాస్పిటల్స్‌‌లో ఆన్‌‌లైన్‌‌తో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుందన్నారు.

హైదరాబాద్‌‌లోనే ఎక్కువ

రాష్ట్రవ్యాప్తంగా 51,48,184 మందికి టీకా వేయాలని టార్గెట్‌‌ పెట్టుకోగా వీళ్లలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 5,90,807 మంది ఉన్నారు. అతి తక్కువగా ములుగు జిల్లాలో 39,420 మంది ఉన్నారు. మేడ్చల్ మల్కాజ్‌‌గిరి 5,08,820లో మంది, రంగారెడ్డి 4,14,180, నల్గొండ 2,26,590, సంగారెడ్డి 2,27,890, నిజామాబాద్ 2,11,190, ఖమ్మం 1,95,910, భద్రాద్రి కొత్తగూడెం1,65,004, వరంగల్ అర్బన్‌‌లో 1,55,220, సూర్యాపేట 1,44,935, కరీంనగర్‌‌లో 1,43,000, కామారెడ్డి 1,37,410, జగిత్యాల 1,37,020, సిద్దిపేట 1,31,568, మహబూబ్‌‌నగర్ 1,27,290, వికారాబాద్ 1,26,434, నాగర్ కర్నూల్ 1,21,550, మంచిర్యాల 1,05,108, ఆదిలాబాద్‌‌లో 1,04,026, పెద్దపల్లి 1,04,000, యాదాద్రి భువనగిరిలో1,03,480, మహబూబాబాద్ 1,02,782,  మెదక్ 99,766, వరంగల్ రూరల్ 96,460, నిర్మల్ 95,748, గద్వాల 87,100, నారాయణపేట్ 83,021, వనపర్తి 81,500, ఆసిఫాబాద్ 74,759, సిరిసిల్ల 72,339, భూపాలపల్లి 60,228 మంది ఉన్నట్లు అధికారులు జాబితాను సిద్ధం చేశారు.

కార్పొరేట్ హాస్పిటల్స్‌‌లో నో సర్వీస్ చార్జ్‌‌

ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ వ్యాక్సినేషన్ స్టార్ట్‌‌ చేసిన విషయం తెలిసిందే. ఒక్కో డోసు ధర రూ. 150 తో పాటు రూ. 100 మించకుండా సర్వీస్ చార్జీ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే హైదరాబాద్‌‌లోని యశోద, అపోలో, విరించి హాస్పిటల్స్ డోసుల రేట్లనే తీసుకుంటున్నాయి. ప్రజలకు హెల్ప్ చేయడమే తమ ధ్యేయమని ఆయా హాస్పిటళ్ల యాజమాన్యాలు చెప్పాయి.