మోడీ ఫెయిల్యూర్ వల్లే టీకా, రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత 

మోడీ ఫెయిల్యూర్ వల్లే టీకా, రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో లిక్విడ్ ఆక్సిజన్‌‌కు డిమాండ్ ఎక్కువైంది. అదే సమయంలో కొవిడ్ ట్రీట్‌మెంట్‌లో కీలకమైన రెమిడెసివిర్ ఇంజక్షన్‌‌లకూ డిమాండ్ ఏర్పడింది. అయితే ఆక్సిజన్, రెమిడిసివిర్‌‌తోపాటు కరోనాపై పోరులో ప్రధానమైన టీకా నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ఆక్సిజన్, రెమిడెసివిర్, వ్యాక్సిన్‌‌ ఉత్పత్తిని పెంచాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అయితే వీటి కొరత ఏర్పడేందుకు మోడీ సర్కార్ నిర్లక్ష్యం, సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడమే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. 

‘ఆక్సిజన్ ప్రొడక్షన్‌లో ప్రపంచంలో భారత్ అందరికంటే ముందుంది. అయినా మన దగ్గర ఆక్సిజన్ కొరత ఎందుకు ఏర్పడింది? ఫస్ట్, సెకండ్ వేవ్‌కు మధ్య 8 నుంచి 9 నెలల గ్యాప్ వచ్చింది. సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా, ఉధృతంగా ఉంటుందని సొంత సర్వేలు హెచ్చరించినా మోడీ పట్టించుకోలే? గత ఆరు నెలల్లో ఇతర దేశాలకు 1.1 మిలియన్ల రెమిడెసివిర్ ఇంజక్లన్లను కేంద్రం సరఫరా చేసింది. ఇప్పుడేమో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఏర్పడిందని చెబుతోంది. ఇలాంటి నిర్ణయాలు సరికావు. సరైన ప్రణాళిక లేకపోవడంతోనే వ్యాక్సిన్ షార్టేజ్ సమస్య వచ్చింది. ప్రజలు బాధలో ఉన్నారు. ఆక్సిజన్, బెడ్‌‌లు, మెడిసిన్స్ లేవని వాళ్లు వాపోతున్నారు’ అని ప్రియాంక పేర్కొన్నారు.