
బేబీ(Baby) సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఒక్క హిట్ తో ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా ఎదిగింది వైష్ణవి. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అయినప్పటికి ఆమె సెలెక్టెడ్ గా సినిమాలు ఒకే చేస్తుందని సమాచారం. తాజాగా సమాచారం ప్రకారం ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చిందట.
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా డబుల్ ఇస్మార్ట్(Double ismart) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఇస్మార్ట్ శంకర్(Ismart shankar) కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఈ మధ్యే లాంఛనంగా ప్రారంభమైంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా.. అందులో ఒక పాత్ర కోసం బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్యను సెలెక్ట్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ న్యూ తెలుసుకున్న నెటిజన్స్ కూడా అవాక్కవుతున్నారు. ఒక్క హిట్టుతో ఏకంగా రామ్ తో ఛాన్స్ కొట్టేసింది వైష్ణవి.. రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. నీ హార్డ్ వర్కే నీకు అవకాశాలు వచ్చేలా చేస్తుంది వైష్ణవి కీప్ ఇట్ అప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవి సెలెక్ట్ అయ్యి హిట్ పడిందంటే ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.