గండిపేట, వెలుగు: సినీ కార్మికుల కోసం తాము ఎంతో కష్టపడి పనిచేశామని చిత్రపురి కమిటీ మాజీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అన్నారు. బుధవారం చిత్రపురి కాలనీలోని తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ లిమిటెడ్ కార్యాలయంలో సభ్యుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో చిత్రపురి కాలనీ అభివృద్ధికి తాము ఎన్నో పనులు చేశామన్నారు. మరోసారి తమ ప్యానల్‌ను గెలిపిస్తే రూ.400 కోట్ల ప్రాజెక్ట్ పూర్తిచేస్తామన్నారు. సమావేశంలో సెక్రటరీ పి.ఎస్.ఎన్.దొర, కమిటీ సభ్యులు లలిత, కొంగర రామకృష్ణప్రసాద్, అలహరి, బత్తుల రాము పాల్గొన్నారు.

