వాతావరణం అనుకూలించక..  రెండు విమానాలు రిటర్న్

వాతావరణం అనుకూలించక..  రెండు విమానాలు రిటర్న్

గండిపేట, వెలుగు: వారణాసిలో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన రెండు విమానాలు తిరిగి ఇక్కడికి వచ్చి ల్యాండింగ్‌‌ అయ్యాయి. ఉదయం 6 గంటలకు స్పైస్‌‌జెట్‌‌, 7 గంటలకు ఇండిగో విమానాలు వారణాసి వెళ్లాయి. అయితే అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమై విమానాలను శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టుకు తిరిగి మళ్లించారు.