రాజధాని పక్క రాష్ట్రంలో ఉన్నా ఓకే : వర్మ

రాజధాని పక్క రాష్ట్రంలో ఉన్నా ఓకే : వర్మ

ఏపీ రాజధానిపై తనదైన స్టైల్లో సంచలన కామెంట్స్ చేశాడు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తన దృష్టిలో రాజధాని అనే పదానికి అర్ధమే లేదన్న వర్మ.. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదన్నాడు. ప్రక్క రాష్ట్రంలో పెట్టినా పట్టించుకోనని.. తనకు రాజధాని ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదన్నాడు.

పరిపాలన కోసమే రాజధాని కావాలంటే సిటీ కో రాజధాని ఉండాలని.. గతంలో రాజధాని కోసం చేసిన ట్వీట్లు పబ్లిసిటీ స్టంటు కోసం చేసినవే అని తెలిపాడు. తనకు సమాజం మీద భాద్యత ఉందని ఎవరికీ, ఎప్పుడూ  చెప్పలేదన్నాడు. గతంలో మూడో వోడ్కా పెగ్గులో ఉండేటప్పుడు రాజధాని కోసం ట్వీట్లు చేశానని.. ఇప్పుడు వోడ్కా లో లేను కాబట్టి రాజధాని గురించి నేనేం మాట్లాడను అని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు ఈ కాంట్రవర్సీ డైరెక్టర్.