Naga Chaitanya: సిక్స్ ప్యాక్ లుక్‌తో నాగచైతన్య... ‘వృషకర్మ’ కోసం షాకింగ్ మేకోవర్!

Naga Chaitanya: సిక్స్ ప్యాక్ లుక్‌తో నాగచైతన్య... ‘వృషకర్మ’ కోసం షాకింగ్ మేకోవర్!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య రూటు మార్చారు. లవర్ బాయ్ ఇమేజ్ ను పక్కన పెట్టి సరికొత్తగా  మునుపెన్నడూ చూడని పక్కా మాస్ అవతారంలోకి మారిపోయరు. కొత్త లుక్ కోసం తెగ శ్రమ పడుతున్నారు.    లేటెస్ట్ గా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైతు ఫిట్ నెస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియా షేక్!

జిమ్‌లో షర్ట్‌లెస్ లుక్‌లో, చేతిలో డంబెల్స్ పట్టుకుని, ఒంటిపై సిక్స్ ప్యాక్ అబ్బురపరిచేలా ఉన్న ఫోటోను చైతూ పోస్ట్ చేశారు. దీనికి “బీయింగ్ అర్జున్” (Being Arjun) అని సింపుల్‌గా క్యాప్షన్ ఇచ్చారు. ఆయన రాబోయే భారీ ప్రాజెక్ట్ 'వృషకర్మ' కోసమే ఈ మేకోవర్ అని తెలియడంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నటుడు సుశాంత్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను చూసి ఫిదా అయిపోయారు. అన్నా.. ఇక బాక్సాఫీస్ దగ్గర వేట మొదలే అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఫిట్‌నెస్ వెనుక కఠోర శ్రమ

చైతన్య ఫిట్‌నెస్ ట్రైనర్ కూడా ఈ పోస్ట్‌పై స్పందిస్తూ, నీ ఈ కొత్త లుక్ వెనుక ఉన్న శ్రమలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. సాధారణంగా సాఫ్ట్ క్యారెక్టర్లు చేసే చైతన్య, ఈ స్థాయిలో కండలు పెంచి ఒక అగ్రెసివ్ లుక్‌లోకి మారడం వెనుక పెద్ద ప్లానే ఉందని అర్థమవుతోంది.

'అర్జున్' లుక్ తోనే సమాధానం,

అయితే, ఈ లుక్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. చైతన్య తన వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల తర్వాత, తన కెరీర్‌ను పూర్తిగా రీబూట్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కొంతమంది విమర్శకులు చైతన్య కేవలం క్లాస్ సినిమాలకే పరిమితమని చేసిన కామెంట్లకు, ఈ 'అర్జున్' లుక్ ఒక గట్టి సమాధానం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేకోవర్ వెనుక కేవలం సినిమా అవసరమే కాకుండా, తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకోవాలనే బలమైన సంకల్పం కనిపిస్తోందంటున్నారు..

'వృషకర్మ'పై భారీ అంచనాలు

యాక్షన్ మోడ్ లోవస్తున్న 'వృషకర్మ' సినిమాలో చైతన్య మునుపెన్నడూ చేయని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించబోతున్నారు. అర్జున్ అనే పాత్ర చైతూ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అక్కినేని వారసుడు, ఈసారి గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.  ఈ మూవీతో చైతన్య బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తారో చూడాలి.