గాంధీల వారసుడు సంచలన కామెంట్స్ చేశారు. భారతదేశంలో ప్రధాని మోడీని మించిన ప్రధాని లేరంటూ కితాబిచ్చారు. తమ కుటుంబంలో కూడా కొందరు ప్రధానమంత్రులుగా పనిచేసినప్పటికీ.. మోడీ లాంటి పాలన ఎవరూ అందించలేదని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది.
బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పార్లమెంటరీ బరిలో నిలిచిన వరుణ్ గాంధీ….ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ క్యాంపెయిన్ లో మాట్లాడారు. మోడీని ఆకాశానికెత్తారు. ఇంతవరకు మోడీ లాంటి పాలన ఎవరూ అందించలేదని కితాబిచ్చారు. భారత్ ను గొప్ప శక్తిగా తీర్చిదిద్దిన ఘనత మోడీకే దక్కుతుందన్న వరుణ్.. ఇలాంటి ప్రధానమంత్రిని ఇంతవరకు చూడలేదన్నారు. తమ కుటుంబం నుంచి కొందరు ప్రధానమంత్రులుగా పనిచేసినప్పటికీ.. మోడీ లాంటి పాలన అందించలేదని ఆరోపించారు. తన ఫ్యామిలీ ప్రధానులపై వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.