మీ జీతంలో కొంత భాగాన్ని ఇవ్వండి:  ఎంపీలకు వరుణ్ గాంధీ రిక్వెస్ట్ 

మీ జీతంలో కొంత భాగాన్ని ఇవ్వండి:  ఎంపీలకు వరుణ్ గాంధీ రిక్వెస్ట్ 

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన తోటి ఎంపీలను రిక్వెస్ట్ చేశారు.  తమ శాలరీ నుంచి కొంత భాగాన్ని ఒడిశా బాధిత కుటుంబాలకు ఇవ్వాలని కోరారు.  వారికి ముందుగా సహయం అవసరమని, ఆ తరువాత న్యాయం చేయాలని తెలిపారు.  ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం తన  హృదయాన్ని కలచివేసిందన్నారు.  ప్రతి ఒక్కరూ బాధిత   కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.  

పశ్చిమబెంగాల్ షాలిమార్ నుంచి చెన్నై వెళుతున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ 2023, జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు షాలిమార్ స్టేషన్ లో బయలుదేరి.. ఆరున్నర గంటలకు బాలాసోర్ చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన ఈ  రైలు.. బాలేశ్వర్ దగ్గరకు రాగానే.. పట్టాలు తప్పి  పక్క ట్రాక్ పై.. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  కోరమండల్ కు చెందిన 12 బోగీలు చెల్లాచెదురుగా పక్కనే ఉన్న మూడో రైల్వే లైన్ (ట్రాక్)పై కొన్ని బోగీలు పడ్డాయి. 

ఈ ప్రమాదం 6 గంటల 50 నిమిషాలకు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత 15 నిమిషాలకు అంటే.. 7 గంటల 15 నిమిషాల సమయంలో.. బెంగళూరు నుంచి హౌరా వెళుతున్న యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు.. పట్టాలపై పడిపోయిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీ కొట్టాయి.

యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు.. 100 కిలోమీటర్ల వేగంతో బోగీలను ఢీకొనటంతో.. కోరండల్ బోగీలు తలకిందులు అయ్యాయి.. నుజ్జునుజ్జు అయ్యాయి.  రెండు రైళ్లలో సుమారు 2,000 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ  ఘటనలో  ఇప్పటివరకు  261 మంది మృతి చెందగా, 900 మందికి పైగా  గాయపడ్డారు.