వరుణ్ సందేశ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇటీవల ‘నయనం’ వెబ్ సిరీస్ రూపొందించిన స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈచిత్రానికి ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై ఆహా సమర్పణలో శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు.
ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించగా, నిర్మాత సి కళ్యాణ్ క్లాప్ కొట్టారు. నటుడు, నిర్మాత, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు నీలకంఠ తొలి షాట్ డైరెక్షన్ చేశారు.
సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రవీణ్, మోహిత్, సత్య శ్రీ (జబర్దస్త్) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఉమర్జీ అనూరాధ కథను అందించగా శ్రీనివాస్ మండల స్క్రీన్‌ప్లే రైటర్‌గా, ఆదిత్య భార్గవ్ డైలాగ్స్ అందిస్తున్నారు.
