ముషీరాబాద్, వెలుగు : వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం బాగ్ లింగంపల్లి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (అటానమస్) కాలేజీల్లో సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వి.ఆదిత్య భరద్వాజ్.. అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మట్ట పాల్గొన్నారు.
సికింద్రాబాద్ సరస్వతీ ఆలయంలో..
పద్మారావునగర్: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద శ్రీజ్ఞాన సరస్వతీ దేవాలయంలో చిన్నారుల అక్షరాభ్యాసం ఘనంగా జరిగింది. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు తమ పిల్లలతో ఆలయానికి చేరుకుని పూజల్లో పాల్గొన్నారు.
