
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు సలహాదారుగా కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నియమితులయ్యారు. జలవనరుల శాఖకు సంబంధించిన అంశాలపై గైడెన్స్, విధానపర నిర్ణయాల్లో సీఎంకు ఆయన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. రాష్ట్ర మంత్రి హోదాకు సమానంగా వెదిరె శ్రీరామ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్గా నియమించింది. ఈ మేరకు ఈ నెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలో రోజు రోజు కూ నీటి వనరుల నిర్వహణపై సమస్యలు పెరిగిపోతున్నాయని, అస్థిర వర్షపాతం, వాతా వరణ మార్పులు, పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, వ్యవసాయ అవసరాలు పెరగ డం ఇందుకు కారణమవుతున్నాయని ప్రభుత్వం పేర్కొన్నది.
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర దలు వస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే దానికి పరిష్కారంగా కేంద్రం నదుల అనుసంధానం చేపట్టినట్లు పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణను విజయవంతంగా అమలు చేసేందుకు ఓ టెక్నికల్, దీర్ఘకాలిక విధాన ప్రణాళిక, సమన్వయం కోసం ఓ నిపుణుడిని నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ప్రభుత్వం వెల్లడించింది.