డెడ్ బాడీపై నుంచి దూసుకెళ్లిన కార్లు

డెడ్ బాడీపై నుంచి దూసుకెళ్లిన కార్లు

లక్నో :  ప్రమాదానికి గురైన వ్యక్తి పైనుంచి రాత్రంతా అనేక కార్లు దూసుకువెళ్లాయి. దీంతో మృతదేహం భాగాలు బండ్ల చక్రా ల కింద నలిగి ఛిద్రమయ్యాయి. తారు రోడ్డుకు అతుక్కుపోయాయి. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఓ ఎక్స్ ప్రెస్ హైవేపై చోటు చేసు కున్న ఈ ఘటన ఆందోళన కలిగించింది. ఆ డెడ్ బాడీ భాగాలను కలెక్ట్ చేసేందుకు పోలీసులు పారను ఉపయోగించాల్సి వచ్చింది. 

ఘటన స్థలంలో ఓ వేలును సేక రించిన పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపి బాధితుడిని గుర్తించాలని ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగమంచు తో డ్రైవర్లు ఎవరూ ఈ డెడ్ బాడీని చూసి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించా రు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉంటుంద ని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.