నేపాల్ నుంచి ట‌మాటా స్మగ్లింగ్.. రెండు లారీలు ప‌ట్టుకున్న ఇండియా

నేపాల్ నుంచి ట‌మాటా స్మగ్లింగ్.. రెండు లారీలు ప‌ట్టుకున్న ఇండియా

ఇండియాలో టమాటా ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో చూస్తూనే ఉన్నాం. ఓ మోస్తరు టమాటాలు అమ్మిన వ్యక్తి రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిన సంఘటల్నీ ఇటీవల చూశాం. అంత కాస్ట్లీ టమాటాను రక్షించుకోవడం కూడా ఇప్పుడు వ్యాపారులకు టాస్క్​ అయిపోయింది. ప్రస్తుతం భారత్​లో టమాటాల ధర రూ.150 పైనే పలుకుతోంది. అయితే నేపాల్​ నుంచి అక్రమంగా టమాటాలను స్మగ్లింగ్​ చేస్తున్న  లారీలను జులై 18న పోలీసులు పట్టుకున్నారు. 

పెరిగిన టమాటా ధరల నేపథ్యంలో నేపాల్​ నుంచి ఇండియా కూరగాయల దిగుమతిని నిషేధించింది. నిషేధం అమలులో ఉన్నా ఇటీవల ఆ దేశ సరిహద్దు నుంచి ఇండియాకు రెండు లారీల్లో టమాటాలు అక్రమంగా తరలిస్తున్నట్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వాహనాలను సరిహద్దు పోలీసులు అడ్డుకొని ఇండోనేపాల్​ సరిహద్దులోని భారత కస్టమ్స్​ కార్యాలయానికి పంపించారు. 

అక్కడ అధికారులు వారి నుంచి డబ్బులు తీసుకుని వాహనాలను అనుమతించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు డబ్బులు వసూలు చేసిన అధికారులను సస్పెండ్​ చేశారు. కూరగాయల దిగుమతిని సైతం భారత్​నిషేధించడంపై నేపాల్​వ్యాపారులకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ముంబయి రిటైల్​మార్కెట్లో కిలో టమాట ప్రస్తుత ధర రూ.160గా ఉంది.