విగ్రహాల ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

విగ్రహాల ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

బాల్కొండ, వెలుగు : కమ్మర్ పల్లి మండలం మానాలలోని దేగావత్ తండాలో నూతనంగా నిర్మించిన జగదాంబ మాత, సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో శుక్రవారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు.  సంత్ సేవాలాల్, మాతా దీవెనలు ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.