నిజామాబాద్ జిల్లా రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇంట్లో అగ్నిప్రమాదం

నిజామాబాద్ జిల్లా రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇంట్లో అగ్నిప్రమాదం

నిజామాబాద్ జిల్లాలో  అగ్నిప్రమాదం జరిగింది. జిల్లా రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నివాసంలో అర్ధరాత్రి వేళ భారీ ప్రమాదం చోటుచేసుకుంది.అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో... ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా మంటలు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో గడుగు గంగాధర్ గారి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లోని వస్తువులు, ముఖ్యమైన పత్రాలు పూర్తిగా బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి వేళ ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణనష్టం తప్పినప్పటికీ... ఆస్తి నష్టం మాత్రం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది.