
- ఢిల్లీలో రాహుల్, ఖర్గే అందుబాటులో లేక వాయిదా
నల్గొండ, వెలుగు : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ నెల 29న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం వీరేశం శనివారమే పార్టీలో చేరాల్సి ఉంది. కానీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అందుబాటులో లేకపోవడంతో 29కి వాయిదా పడింది. అదేరోజు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు రేఖానాయక్, మైనంపల్లి హన్మంతరావుతో సహా పలువురు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.
వీళ్లతో పాటే వీరేశం కూడా పార్టీలో అధికారికంగా చేరనున్నారు. కాగా, వీరేశం శనివారం ఢిల్లీలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, స్టేట్ఇన్చార్జ్మాణిక్ రావు ఠాక్రేతోపాటు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో భేటీ అయ్యారు. రేవంత్ సమక్షంలో నకిరేకల్‌కు చెందిన వీరేశం వర్గీయులు గాదగోనికొండయ్య, వీరా అర్జున్ రెడ్డి, నకిరేకంటి నరేందర్, దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, అచ్చాలు గౌడ్, రామన్నపేట సర్పంచ్ భర్త పృథ్వీ, బొజ్జ సుందర్, మాధవరెడ్డి మల్లేశ్, రఘుమా రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.