బుల్లెట్ కన్నా బ్యాలెట్ శక్తిమంతమైంది

బుల్లెట్ కన్నా బ్యాలెట్ శక్తిమంతమైంది
  • మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, వెలుగు: బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నక్సలిజం నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’పై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ ఆపరేషన్ తో నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందన్నారు. నకమ్యూనిస్టుల మధ్య కూడా ఎన్నో విభేదాలు ఉన్నాయని చెప్పారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో వెంకయ్య నాయుడు చిట్ చాట్ చేశారు. బీజేపీ అగ్రనేత అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఢిల్లీకి వచ్చానన్నారు. దేశ స్వాతంత్రానికి వందేమాతరం స్ఫూర్తి అని కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాల్లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 

రాజకీయ పార్టీలు ఓటర్ లిస్ట్ ను వెరిఫై చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఈ విషయంలో పార్టీలు ముందే అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మల్టీనేషనల్ కంపెనీలను ఇండియన్స్ రన్ చేయడం గర్వంగా ఉందన్నారు. అగ్రరాజ్యం అమెరికాలోనూ పరిస్థితి మారిందన్నారు. అక్కడి ఎన్నికల్లో భారతీయ సంతతి వాళ్లు గెలుస్తున్నారన్నారు. ఏ రంగంలో అయినా ఇండియా ఇతర దేశాలతో పోలిస్తే తెలివైనదని వ్యాఖ్యానించారు.