వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.. కేంద్రం కొత్త గైడ్ లైన్స్

వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.. కేంద్రం కొత్త గైడ్ లైన్స్

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు, మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజర్ వాడటంతోపాటు వెంటిలేషన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇళ్లు, ఆఫీసుల్లో వెంటిలేషన్ ఎక్కువగా ఉండేటట్లు చూడాలని స్పష్టం చేసింది. తద్వారా పాజిటివ్ పేషంట్లు ఉన్నా వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి అవ్వకుండా నిరోధించొచ్చునని స్పష్టం చేసింది. వెంటిలేషన్ వల్ల కరోనా సమూహ వ్యాప్తి కాకుండా చూసుకోవచ్చునని.. వెంటిలేషన్ ఎక్కువగా ఉంటే కరోనా వ్యాప్తి అయ్యే ఛాన్స్ స్వల్పమని తెలిపింది. కరోనాపై యుధ్ధంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇందుకు కోవిడ్ రూల్స్ పాటిస్తే చాలని పేర్కొంది.