వెటర్నరీ డాక్టర్లకు ఆర్టీసీ డ్యూటీలు!

వెటర్నరీ డాక్టర్లకు ఆర్టీసీ డ్యూటీలు!

డిపోకు వెళ్లి రిపోర్ట్ చేయాలంటూ..
నలుగురు డాక్టర్లకు
కలెక్టర్ ఉత్తర్వులు
వనపర్తి జిల్లాలో వింత

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పశువులకు ట్రీట్ మెంట్ చేస్తూ, రైతులకు అండగా నిలవాల్సిన వెటర్నరీ డాక్టర్లను ఆర్టీసీ డిపోలకు పంపుతోంది సర్కారు! వనపర్తి జిల్లాలో ఈ వింత పరిస్థితి వెలుగుచూసింది. వనపర్తి జిల్లాకు చెందిన నలుగురు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లకు వనపర్తి ఆర్టీసీ డిపోలో రిపోర్టు చేయాలంటూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం అవుతుండటంతో సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఆయా ప్రాంతాల్లోని పశుసంవర్ధక శాఖ డాక్టర్లను ఆర్టీసీ డిపోల్లో విధులకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం వనపర్తి జిల్లా పానగల్, శ్రీరంగపూర్, పెబ్బేరు, కొత్తకోట ప్రైమరీ వెటర్నరీ సెంటర్ లకు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లు డాక్టర్ కె. శ్యామ్, డాక్టర్ మాధవి, డాక్టర్ నిఖిల్ రెడ్డి, డాక్టర్ విజయ్ కుమార్ లకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

డిప్యుటేషన్​పై వనపర్తి ఆర్టీసీ డిపోకు పంపుతున్నామని, అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేయాలని నలుగురు డాక్టర్లనూ ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీంతో వారు డిపోలో డ్యూటీలకు సిద్ధమవుతున్నారు. అయితే, వెటర్నరీ డాక్టర్లను ఆర్టీసీ డిపోలకు పంపడంపై వెటర్నరీ డాక్టర్లు, వెటర్నరీ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో సిబ్బంది కొరత ఉన్నాఇలా డాక్టర్లకు ఆర్టీసీ డిపోలో డ్యూటీలు వేయడం ఏ మిటంటూ మండిపడుతున్నారు. పశువులకు వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లను డిప్యుటేషన్​పై ఇతర సంస్థల్లోకి పంపడం ఇదే తొలిసారని, ఇది రూల్స్​కు విరుద్ధమని వెటర్నరీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు డాక్టర్‌‌‌‌‌‌‌‌ కాటం శ్రీధర్‌‌‌‌‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.