నేవీ చీఫ్‌‌‌‌గా.. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్

నేవీ చీఫ్‌‌‌‌గా.. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్
  • ఈ నెల 31న బాధ్యతల స్వీకారం.. 
  • 2028 వరకు పదవిలో కొనసాగింపు

న్యూఢిల్లీ: భారత నౌకాదళ అధిపతి (నేవీ స్టాఫ్ చీఫ్)గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ముంబైలోని వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన.. ఈ నెల 31న నేవీ చీఫ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2028  వరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి రిటైర్ అవ్వడంతో ఆ స్థానంలో స్వామినాథన్​కు అవకాశం కల్పించారు. 

వైస్ అడ్మిరల్ స్వామినాథన్ జులై 1, 1987న భారత నౌకాదళంలో చేరారు. కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ వార్‌‌‌‌ఫేర్‌‌‌‌లో నిపుణుడు. ఆయన తన కెరీర్‌‌‌‌లో పలు కీలక నౌకలకు కమాండర్‌‌‌‌గా వ్యవహరించారు.