వీడియో: చపాతీలు చేస్తున్నప్పుడు వాటిపై ఉమ్మి..

వీడియో: చపాతీలు చేస్తున్నప్పుడు వాటిపై ఉమ్మి..

డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయాలని హోటల్స్‌‌కు వెళ్తుంటాం. ఇంట్లో భోజనం తిని బోర్ కొట్టి కూడా చాలా మంది రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, తోపుడు బళ్లలో ఫుడ్‌‌ను తింటుంటాం. రుచి, నాణ్యత, పాపులారిటీని బట్టి హోటల్స్‌‌లో రేట్లు ఫిక్స్ చేస్తుంటారు. అందుకే ఖరీదు ఎక్కువున్నా పెద్ద హోటళ్లకు వెళ్లడానికి కొందరు ప్రాధాన్యత ఇస్తారు. అయితే హోటల్ ఎలాంటిదైనా వండే వాళ్లు కూడా శుచి, శుభ్రతకు ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటారు. కానీ ఇక్కడో హోటల్‌‌లో చపాతీ చేసే వ్యక్తి నిర్వాకం చూస్తే ఎవ్వరికైనా కోపం రావాల్సిందే. ఉత్తర్ ప్రదేశ్‌‌, మీరట్ సిటీలోని ఎరోమా హోటల్‌‌లో తీసినట్లుగా చెబుతున్న ఈ వీడియో నెట్‌‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చపాతీలు చేసే వ్యక్తి.. చపాతీలు చేసే సమయంలో వాటికి ఉమ్ము అంటించడాన్ని చూడొచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. ఇది అసహ్యకరమైన చర్య అని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారిని తప్పకుండా శిక్షించాలని కోరుతున్నారు.