ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లా కాలేజీలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విజిలెన్స్ అధికారి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యువత అవినీతి రహిత సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
సమాజంలో విద్యార్థులు బాధ్యతగా ఉండేందుకు నిజాయితీ, నైతిక విలువలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. అనంతరం విజిలెన్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనే థీమ్ తో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు సర్టిఫికెట్లు, ప్రశంసా పత్రాలను అందజేశారు. డీఎస్పీ శ్రీనివాస్, లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సృజన, ఫ్యాకల్టీ సిబ్బంది పాల్గొన్నారు.
